RSS

నా చిన్నతనం



నాగార్జునసాగర్ బ్రిడ్జి గేటులు పూర్తిగ వదిలారని చాలదూరం నుంచి చూడాలని వస్తున్నారని
ట్రాఫిక్ చాల రద్దీగావుంది అని బయటి నుంచి వచ్చిన మాబాబు విసుక్కోవటం
చూచి నాకు చాల నవ్వు వచ్చింది. .
ఎందుకంటే నాచిన్నతనంలో ఇంత రద్దీ వుండేది కాదు.ఆదివారం వచ్చినదంటే
సాగర్ చూడటానికి వెళ్ళే వాళ్ళతో వీధులు కళకళలాడేవి .

నేను సెవెంత్ చదివేటప్పుడు ఏదో ఎలెక్షన్ మీటింగ్ అని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు
సాగర్ వస్తున్నారని తెలిసి సుదూర ప్రాంతాలనుంచి అక్కడికిచేరుకున్నారు .
మా స్కూల్ నుంచి మాస్కూల్ పిల్లలు మాక్లాసు సిస్టర్ మేరీపెట్రీషియా గారు వెళ్లారు .
నేను మాత్రం మా పెద్దమ్మ పిల్లలుతో కలసి వెళ్ళాను.చాలాబాగుంది .
కానీ త్రాగటానికి నీరు దొరకక చాలా ఇబ్బందిపడ్డాము.
ఇప్పటిలాగా అప్పట్లో నీళ్ళు కొనుక్కోవటానికి వుండేది కాదు..
మీటింగ్ చాల రాత్రి వరకు జరిగినది.తిరుగు ప్రయాణంలో వెహికల్స్ దొరకక బాధపడ్డాము .
ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి.నాకోసం మానాన్న,అమ్మ,అందరు ఎదురుచూస్తున్నారు.
నాన్న చాలా కోప్పడ్డారు..నాజీవితంలో నాన్నతోతిట్లు తినడం అదే మొదటిసారి చివరిసారి.

ట్రాన్సిల్స్ తో క్లాసెస్ చాల డుమ్మా కొట్టేదాన్ని.నాన్ననాకు చాలాఇష్టo.తనతో కలసి చూసిన సినిమాలు ,
తిరిగిన స్థలాలు ఎప్పటికి గుర్తే.నాన్న డ్యూటీకి విజయవాడ,గుంటూరు వెళితే నాకు రిబ్బనులు,
రంగురంగుల పూసలదండలు తెచ్చేవారు..
కానీ అంత ప్రేమించిన నాన్న నాపెళ్లి ఐన సంవత్సరానికే చనిపోవటం నేను తట్టుకోలేకపోయాను .
అది నా జీవితం లో మరువలేని పెద్ద విషాదం..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

అక్క పెళ్లి

నాకు బాగా గుర్తు వచ్చిన టైం అంటే నాకు ఏడు సం. ఒకరోజు నేను స్కూల్ నుంచి వచ్చే సరికి మా ఇంటిలో కొత్త మనుషులు హడావిడి .తరువాత కొన్నిరోజులకి తెలిసినది హడావుడి మా పేద్ద అక్క పెళ్లి అని .మా అందరికి కొత్తబట్టలు అక్కకి నగలు తీసుకున్నారు .పెళ్లి రోజు కన్నా వారం ముందుగా మా ఇంటికి మా పెదనాన్న ,వాళ్ళ పిల్లలు ఇంకా ఇతరులు వచ్చారు .పెద్ధవాల్లంత ఒక దగ్గిర పిల్లలంతా ఒక దగ్గిర చేరి బాగా అల్లరి చేసిన గుర్తు .పెల్లిరోజున అక్కని బావగారిని పల్లకిలో ఉరేగిచ్చారు .సాయంత్రం పందిట్లో మేజువాణి అంటే డాన్సర్స్ ని తీసుకువచారు. విధంగా అక్క పెళ్లి చాలా బాగా జరిగింది.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...