RSS

వీరయ్య - కోటేశ్వరి



ఒక రోజు నేను స్కూల్ నుంచి వచ్చే సరికి మా రెండో ఇంట్లో నుంచి సందడి వినిపించింది .
మా
అమ్మను ఎవరు అని అడిగాను. మన ఇంటిలోకి అద్దెకి వచ్చారు అని చెప్పింది.
ఉదయాన్నే
నేను స్కూల్ కెళ్లాలని బయటికి వచ్చినప్పుడు మా ఇంటి ముందు ఒక సైకిల్ దాని దగ్గర ఒకతను.
మాఇంట్లో
కి అద్దెకి వచ్చింది వీళ్ళేనేమో అనుకోని స్కూల్ కి వెళ్లాను .
రీసెస్
పిరియడ్ లో స్కూల్ బయటి కొచ్చిన నేను అక్కడ k.c.p ఫాక్టరీ వర్కర్స్ కోసం కట్టిస్తున్న
ఇండ్ల దగ్గర మా ఇంట్లో రెంట్ కొచ్చినతను... అక్కడి వర్కర్స్ కి సూచనలు ఇస్తున్నారు .
నన్ను
చూసి స్కూల్ లోన నీవు చదువు కొనేది అని అడిగారు.

నేను చాల తొందరగా ఇంటి కొచ్చి మా అమ్మకు విషయం చెప్పాను.
అవును
అతను సివిల్ ఇంజినీర్ ఇక్కడి సిమెంట్ ఫాక్టరీలో ..మీ స్కూల్ దగ్గిరే అని చెప్పింది.
ఇంక
ఆయన భార్య పేరు కోటేశ్వరి . చాల అందంగా ఉండేది. మెడ నిండా నగలు,
చేతులకు
బంగారు గాజులతో చాల బాగుండేది.
చాల
తొందరలోనే వాళ్ళతో మాకు చనువు ఏర్పడింది. మేము వాళ్ళని అన్నయ్య ,వదినా అని పిలిచే వాళ్లము..
వాళ్ళు
ఇంగ్లీష్ పేపర్,మేము తెలుగు పేపర్ తెప్పించే వాళ్ళం.
అది
చూచి చదువుకునే పిల్లలు ఇంగ్లీష్ పేపర్ చదవాలి అని చెప్పి వాళ్ళ పేపర్ మాకిచ్చేవాళ్ళు.
మధ్యాహ్నం
పూట అమ్మ ,పెద్ద అక్క ,మా అన్నయ్య అందరితో కలసి వదిన అష్టా చెమ్మా ఆడేవాళ్ళు.
అన్నయ్య
నన్ను సైకిల్ మీద స్కూల్ కి తీసుకెళ్ళేవారు.

వాళ్ళు
మాతో చాలా బాగా కలసి పొయ్యారు. కొన్నాళ్ళకి అన్నయ్య కి గాజువాక స్టీల్ ప్లాంట్ లో
జాబు
వచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళినతరువాత చాల రోజులు లెటర్స్ రాసేవాళ్ళు.
ఒకసారి
నాన్న అన్నయ్య వెళ్లి వచ్చారు. ఇప్పటికి అన్నయ్య రిటైర్ అయ్యి ఉండొచ్చు ...
ఎంత
మంది పిల్లలో ఎలా వున్నారో??
మంచి
వాళ్ళని ఎన్ని సంవత్సరాలు అయినా మరచి పోలేము.
అన్నయ్య పేరు వీరయ్య వదిన పేరు కోటేశ్వరి


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నాకు నచ్చిన కధ...నాన్న ఎప్పుడొస్తారు?


రోజు ఆదివారం అవటాన కొంచెం లేట్ గానే లేచాము..
టిఫిన్
,కాఫీ పూర్తి చేసి పేపర్ తిరగేయటం మొదలు పెట్టాను.
సాక్షి
ఆదివారం ఫన్ డే బుక్ లో ఒక స్టొరీ నా గుండెను కదిలించివేసినది.
ఇది
పిల్లల తండ్రి చాట్ బందర్ దగ్గిర బాంబు బ్లాస్ట్ లో చనిపొతే ఆభార్య
దుఖాన్ని భరిస్తూ విషయాన్నీ తన పిల్లలకు ఎలా చెప్పాలో అర్ధమవక
తల్లి పడే బాధను కళ్ళకు కటినట్టుగా చాల బాగా రాశారు.
కధ చదివి చాల సేపటివరకు నాకు బాధ వేసినది .
చివరిలో
ఒక వాక్యం హృదయాన్ని చాల బాదకు గురిచేసినది.
"బయట
నల్లగా చీకటి ....పొరలు పొరలు గా దుఖం లాగా నగరం లోని మల్టీ స్టోరీడ్ అపార్ట్ మెంట్లో
మినుకుమనే
దీపాలు ..ఎవరి జీవితాలూ వారివి అంతే...ఇంకేమి లేదు. "

నిజంగా
గోకుల్ చాట్ బాంబు బ్లాస్ట్ సంఘటనలో ఎందఱో తల్లిపిల్లలు అన్నదమ్ములు ,అక్కాచెల్లెలు ,
భర్తలు
పోయిన వాళ్ళు భార్యలు పోయిన వాళ్ళు,అవయవాలు పోయినవాళ్ళు .
వీళ్ళందరూ
అన్యాయం చేసారని ఇవన్ని అనుభవించాలి.
ఇలాంటి
సంఘటనలు జరిగిన తర్వాత కొన్ని రోజులు సంతాపసభలు పెట్టడం ,
తరువాత
అంతా మాములుగానే కాలచక్రం తిరిగిపోతుంది .
ఎవరో
ఒకరు ఎపుడో అపుడు ....అన్నటుగా గుండెని తట్టే ఇలాటి కధలు
చదివి
నపుడు ఒక్క క్షణం కలుక్కుమంటుంది.
ఇంత
మంచి కధను రాసిన ఆకునూరి హసన్ గారికి థాంక్స్.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

మేము - మా అన్నయ్య


అన్నయ్య అందరికంటే పెద్ద వాడవటంతో అవసరమైన బయటి పనులన్నీ తనే చేసేవాడు.
చదువులో కూడా మాకు సలహాలు చెప్పేవాడు. మేము వాడుకొనే మంచి నీళ్ళు బావి నుంచి తెచ్చుకునే వాళ్ళం.
ఇంట్లో కావలసినన్ని నీళ్ళు అన్నయ్య ఒక్కడే తెచ్చేవాడు..

మేము స్కూల్ కి వెళ్ళాలన్నా ఏదన్న సినిమా కెళ్లాలన్నా అన్నయ్య మా వెంబడి వచ్చి
మరల జాగ్రత్తగ తీసుకోచ్చేవాడు.మా అందరిని చాల ప్రేమగా చూసేవాడు .
మా అందరికీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా అదే ప్రేమతో ఉన్నాడు.
మా పెద్దక్క చాల అమాయకురాలు...తనకి చాల చిన్న వయసులోనే పెళ్లి జరిగినది .
రెండవ అక్కకి కూడా అంతే .తరువాత నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకొనేటప్పుడు పెళ్లి జరిగినది.
మావారు అమ్మకు కొద్దిగా దూరపు బంధువులు..
వాళ్ళ అమ్మ పుట్టుంటి వూరు అంతే మా అమ్మమ్మ వాళ్ళ వూరు.
మావారు అమ్మని ,మమ్మలందరినీ చాల ప్రేమగా చూసేవారు.
నా పెళ్లి,అన్నయ్య పెళ్లి ఒకేసారి జరిగినది.
కాని ఏడాదికే నాన్న హార్ట్ అట్టాక్ తో చనిపోయారు. తరువాత కుటుంబ బాధ్యత అమ్మ ,అన్నయ్యది.
మిగిలిన ఇదరు చెల్లెళ్ళకు కూడా బాగానే కట్న కానుకలతో అమ్మ,అన్నయ్య పెళ్లి చేశారు .
ఇది మాఆరుగురి గురించి . మా అందరికి పిల్లలు.

అమ్మ చాలాబాగా పాటలు పాడేది. దేవుడి పాటలు,భజన్స్ చాలా ఇష్టం .
తెల్లవారుజామునే లేచి భక్తి గీతాలు కూనిరాగాలు పాడుకుంటూ పనులు చేసుకునేది.
మాఇంట్లో చాల పెద్ద తులసి కోట ఉండేది .పసుపు ,కుంకుమ తో చాల అందంగా వండేది.
తులసి కోట చుట్టూ ఎర్ర మట్టి తో అలికి ,దాని పైన తెల్లటి ముగ్గుతో అలంకరించేది.
అదేఅలవాటు ఇపుడు మా అందరికి వచ్చినది..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నేను -నా కుటుంబం


మాది పెద్ద కుటుంబం అనే చెప్పు కోవాలి .మా ఇంట్లో మా నాన్న,అమ్మ అన్నయ్య , ఇద్దరు అక్కలు, నేను ,ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవాళ్ళం . అయినా మాకు ఏలోటు లేకుండా పెంచారు అమ్మ,నాన్న .
మా
అన్నయ్య ,రెండో అక్క అమ్మతో ఎక్కువప్రేమగా ఉండే వాళ్ళు. నేను చిన్నచెల్లి నాన్న మీద ప్రేమ .
మా
మొదటి చెల్లి మా అందరినే డామినేట్ చేసి అందరిని బెదిరించేది.

మా
కుటుంబాన్ని అంతటినీ అమ్మ ఎంతో ఓపికగా ఎవరి అవసరములు ఏమిటో
కనుక్కుని
పనులన్నీ చేసేది .ఉదయాన్నే స్కూల్ కెళ్లటానికి రెడీ చేయటం ఒక ప్రళయం .
మా
ఐదుగ్గురికి చాల పెద్ద జుట్టు .అమ్మ వరసన జడలు వేసి వరసన స్నానాలు చేయించేది..
మాకు
ఒకోకరికి రెండు సం తేడ అవటంతో మా అందరి పనులు అమ్మ ఒక్కటే చేయలిసి వచ్చేది.
మా
ఉరు లో ఇప్పటికీ చిన్నకాన్వెంట్ గాపిలిచే స్కూల్ కి బయలు దేరేవాళ్ళం. అన్నయ్య హైస్కూల్ కి వెళ్ళేవాడు .
మా
అందరిలో రెండో అక్క కి అమ్మ మీద ప్రేమ ఎక్కువ అని చెప్పా కదా అది చదువుకోవటం కష్టం అనిపించి
అమ్మ
పనులు ఎక్కువ అయ్యి చేయలేక బాధ పడుతుంటే చూడలేను అని తొమ్మిదితో మాని వేసింది .
అది
అమ్మ ,నాన్న ద్రుష్టి లో చాల ప్రేమ కలది .

పండగ
వచ్చిందంటే మాఇంట్లో సందడి అందరమూ బట్టలు కుట్టించుకోవటంతో మొదలవుతుంది.
ఇప్పుడు
తలచుకొంటె చాల నవ్వు వస్తుంది.. నాన్న,అన్నయ్య ఒకేరకం బట్టలు తెచ్చుకునేవారు..
ఇంక
మా అందరికీ ఒకే రకం గౌనులు,లంగాలు కుట్టించే వాళ్ళు.
చుట్టుపక్కల
వాళ్ళు బాండ్ మేళం అని నవ్వుకునే వాళ్ళు..
ఎంత
నవ్వుకున్నా పండగ రోజున అందరం కొత్త బట్టలు వేసుకుని,మా అమ్మవేసిన మా పెద్ద పెద్ద జడలలో
పెరట్లో
మా అమ్మ పెంచిన బంతి పూలతో కట్టిన పూలమాలలు పెట్టుకుని అమ్మ వెంట గుడికి వెళ్లి రావటం,
అమ్మ చేసిన పిండి వంటలు ఒకరిపై ఒకరు పోటీలు పడుతూ తినటం

ఇప్పటికీ
సందడి అంతా నా కళ్ళలో ఉన్నట్లే వుంటుంది.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...