RSS

మా నాన్న


నాన్న గురించి ఎంత రాసిన ఇంకా ఏవో జ్ఞాపకాలు ఉంటూనే వుంటాయి.
మాతాతయ్యకి మానాన్న, పెదనాన్న ఇద్దరే పిల్లలు .
ఇద్దరు నన్ను ఎంతగానో ప్రేమించే నేను ఇష్టపడే వాళ్ళు.
నాన్నడ్యూటీ కి తెల్లవారుజామున వెళుతూ నన్నుచదువుకోమని అందరినీ లేపేవారు .
అక్కయ్య,అన్న,చెల్లెళ్ళు చదవకుండా కూర్చుని నిద్రపోయే వాళ్ళు..

నాన్న డ్యూటీ నుండి రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చేవారు..
నేను నాన్న తెచ్చే మిఠాయిల,కాయల కోసం మేలుకొని ఉండేదాన్ని .
నాన్నకి,నాకు నాన్వెజ్ అంటే చాలా ఇష్టం .అన్నయ్య అక్కవాళ్ళు పెద్దగా తినేవాళ్ళు కాదు.
నాన్న ,పెద్దనాన్న ఇద్దరు మొదట పోలీసు డిపార్ట్ మెంట్ లో జాబ్ చేసేవారు .
మా నాన్నగారి నాన్న కుడా రైల్వే పోలీసు కానిస్టేబుల్.పెద్దనాన్న ప్రమోషన్స్ వచ్చి
తను రిటైర్ అయ్యే నాటికి S.I అయినాడు.

మా నాన్న కొంచెం ఆవేశపరుడు కావటంతో .. ఒకరోజున ఎందుకో పెద్ద ఆఫీసర్స్ తో
గొడవలొచ్చి రిజైన్ చేసారంట.తరువాత R.T.C లో డ్రైవర్ గా చేరి స్పీడ్ డ్రైవర్ గా పేరు తెచుకున్నారు .
ఇప్పుడు మాచెర్ల నుండి తిరుపతి వెళ్ళాలంటే ఇద్దరు డ్రైవర్స్ కావాలి .
కాని మానాన్న ఒక్కరే వెళ్లి వచ్చారంట.
శివరాత్రి వచ్చిందంటే శ్రీశైలం డ్యూటీ కి వెళ్లేవారు. రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు కుందేలు తీసుకొచ్చేవారు..
హైదరబాద్ వెళితే రాత్రి పది గంటలుకు ఇంటికి వచ్చేవారు .. టైం లో నేను చదువుకుంటా వుండేదాన్ని .
ఎందుకంటే నాన్నహైదరాబాద్ నుండి స్పెషల్గా తెచ్చే తెల్లద్రాక్ష కోసమే .

మా ఉరు లో అప్పటిలో మూడు సినిమా హాల్స్ మాత్రమె ఉండేవి మాటినీ
రెండున్నర కి,ఫస్ట్ షో ఏడున్నర కి . ప్రతి షో ముందు వెనుకా ఏడుకొండలవాడ ఎక్కడున్నావయ్య
అనే పాటను పెట్టేవారు తరువాత పాట ఏమిటో నీ మాయ అనే పాట. .
ఇప్పుడు పాటల కంటే అప్పటి పాటలు చాలా బాగుండేవి .అయినా ఎవరి అభిప్రాయాలూ వారివి

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 వ్యాఖ్యలు:

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...