ఈ రోజు మధ్యాహ్నం నేను టీవీ పెట్టే సరికి "వనితా చానెల్"లో రచయిత్రి శైలజా అనే ఆవిడ, ఇంకొక వ్యక్తి అతని వివరాలు నాకు తెలియలేదు.వీళ్ళిద్దరితో "అత్తామామలు వద్దంట" అనే విషయం గురించి లైవ్ షో లో యాంకర్ మాట్లాడుతుంది.
వాళ్ళ చర్చలో ముఖ్యమైన విషయం ఏంటంటే "పెళ్లి ఐన తర్వాత కొడుకుని కానీ కూతుర్ని కానీ తల్లిదండ్రులు ఏమీ ఆశించకూడదు.వాళ్ళని వాళ్ళ స్వేచ్చకు వదిలేసి వెళ్లి వృద్దాస్రమాల్లో వుండాలి.కని పెంచాము కాబట్టి ముసలితనంలో మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని పిల్లల్ని విసిగించకూడదు" ...అని ఇద్దరు వక్తలు మాట్లాడారు.
వీళ్ళిద్దరినీ యాంకర్ ఒక ప్రశ్న అడిగారు ఏమని అంటే ...
మరి తల్లి దండ్రులు పిల్లల్ని కష్టపడి,ఆస్తులు అమ్ముకునైనా చదివిస్తారు,పెళ్ళిళ్ళు చేస్తారు కదా ?
చివరి రోజుల్లో వాళ్ళని పిల్లలు కాకపొతే ఎవరు చూసుకుంటారు అని.
అప్పుడు ఆ ప్రోగ్రాం లో మాట్లాడుతున్న వక్తల సమాధానం "వాళ్లకి ఎంతో కొంత ఇచ్చి వృద్దాశ్రామాల్లో
పెట్టాలి అంతే కానీ పిల్లలతో ఉంటాము అనకూడదు."
ఫారెన్ లో పిల్లల్ని ఎడ్యుకేషన్ లోన్ తో చదివిస్తారు ఇక్కడ కూడా అలాగే చేయాలి
అప్పుడు ఆ అప్పు పిల్లలే తీర్చుకుంటారు అని మాట్లాడారు.
సరే అలా చూసుకున్నా ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించాలంటే తల్లి కానీ తండ్రి కానీ చేయాల్సిన పనే కదా..
వాళ్ళ హామీ లేనిది పిల్లలకి లోన్ ఇస్తారా?? ఆ విధంగా నైనా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కదా?
జీవిత కాలం కలిసి ఉంటానని,కష్ట సుఖాల్లో బాధ్యత తీసుకుంటానని పెళ్లి నాడు ప్రమాణం చేసాడు
కాబట్టి నా భర్త నా సొంతం అని ఆడపిల్ల అనుకున్నట్లే,నవమాసాలు మోసి కని,కష్టపడి పెంచాను
కాబట్టి నా కొడుకు నా కష్ట సమయంలో నాకు తోడుండాలి,అతని ఆనందంలో నేను పాలుపంచుకోవాలి
అని తల్లిదండ్రులు కోరుకోకూడదా ??
పెళ్లి అయ్యి ఇంట్లో అడుగుపెట్టగానే ఈ ఇల్లంతా నాది,మీరంతా థర్డ్ పర్సన్స్ అని అత్తల్ని,ఆడపడుచులని
అవమానించటం ఆ కోడలికి భావ్యమా??
ఈ కార్యక్రమంలో రచయిత్రి శైలజ గారు ఎంతప్పటికీ అమెరికాలో సెటిల్ అయిన,ఉన్నత కుటుంబాలకు చెందిన వ్యక్తుల గురించే మాట్లాడారు.. కానీ మిడిల్ క్లాస్ వ్యక్తుల గురించి కూడా ఆలోచించాలి.
పిల్లల మీద ఆధార పడకుండా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళున్న తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిల్లల అండ లేకపోయినాబ్రతకగలరు.. కానీ పిల్లల కోసం,వాళ్లకి మంచి జీవితాన్ని ఇవ్వటం కోసం సమస్తాన్నిధారపోసి వాళ్ళకంటూ ఏమీ లేకుండా,చివరికి పిల్లలే ఆధారం గా వుంటారులే అని వాళ్ళనే నమ్ముకున్న తల్లిదండ్రులు ఏమి కావాలి??
నా కొడుకు అమెరికాలో ఉన్నాడు అని గొప్పలు చెప్పుకుంటూనే తల్లిదండ్రులు పిల్లలు
మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని తల్లిదండ్రులు మనసులో తిట్టుకుంటారు అలా తిట్టుకోకూడదు
అని రచయిత్రి శైలజ అన్నారు..
మరి నిజమే కదా కొడుకు ఎంత గొప్ప స్తాయిలో వున్నా, తల్లి మనసుకు సంతోషాన్ని కలిగించాలన్న
విషయం కొడుకులు,కూతుర్లు మర్చిపోకూడదు.అలాగే తల్లి ఒకవేళ ఎప్పుడైనా కోపంతో ఒక్క మాట
పిల్లల్ని అన్నా మరుక్షణమే తన బిడ్డల్ని అలా అన్నందుకు తనే ఎంతో బాధపడుతుంది..
ముసలితనంలో తల్లిదండ్రులు కోరుకునేది ఆస్తిపాస్తులు,అధికారాలు కాదు..
కేవలం పిల్లలు పెట్టే తిండి కోసం వాళ్ళు బ్రతకరు.
పిల్లల నుండి పెద్దలు ఆశించేది ప్రేమతో కూడిన ఒక పలకరింపు,ఈ వయసులో వాళ్ళ మాటకు విలువ ఇచ్చి
వాళ్ళని గౌరవిస్తున్నామన్న ఒక ఆప్యాయతను తల్లిదండ్రులు కోరుకుంటారు.
ఉద్యోగాలు వచ్చి వేరే ప్రదేశాలకి వెళ్ళే పిల్లలు తల్లిదండ్రులను వెంట తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు.
వాళ్లకి అనుకూలంగా ఉన్న చోటనే వాళ్ళ జీవనోపాధికి మార్గాన్ని ఏర్పాటు చేయొచ్చు, వాళ్లకు వీలైనప్పుడు
వచ్చి తల్లిదండ్రులను చూడొచ్చు కదా??
పిల్లల్ని కని, పెంచటం ,చదివించటం తల్లి దండ్రుల బాధ్యత అన్నారు నిజమే..
మరి వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కాపాడాల్సిన బాధ్యత
పిల్లలకి లేదా??
వృద్దాశ్రామాల్లో వుండే వాళ్ళంతా తప్పని సరి పరిస్థితుల్లో,గత్యంతరం లేక అక్కడ వుంటారు కానీ
ఈ పిల్లలు మాకొద్దు అని వదిలేసి,మాకు ఒంటరితనం కావాలి అని ఏ తల్లిదండ్రులు కోరుకోరని నా అభిప్రాయం.
అత్తామామలు వద్దంట...!
5:44 PM |
లేబుళ్లు:
కధలు - కబుర్లు
Subscribe to:
Post Comments (Atom)
9 వ్యాఖ్యలు:
తామరతంపరగా వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నయీ?
"నాని" గారూ మీరు చెప్పింది నిజమేనండీ..
ప్రస్తుతం అందరికీ హక్కులు గుర్తున్నంతగా బాధ్యతలు గుర్తుండటం లేదు.అది నేనైనా కావచ్చు.
చిన్నప్పుడు పిల్లలు ఎంత విసిగించినా విసుక్కోకుండా పిల్లల్ని బుజ్జగించి ఆడించే అమ్మా,నాన్నలను
ముసలి వాళ్ళు అయ్యాక వాళ్ళు అడిగే చిన్న సందేహానికి కూడా సమాధానం చెప్పటానికి విసుక్కునే
పిల్లల్ని ఎందరినో నేను చూశాను నాకు తెలిసిన వాళ్ళలోనే..
ఎవరి సంగతి ఎలా వున్నా నేను,మా తమ్ముడు చెల్లి ముగ్గురం ఎప్పుడూ అనుకుంటాము..
మా అమ్మా,నాన్నలు మమ్మల్ని ఎంత ప్రేమగా పెంచారో అంత ప్రేమగా మేము కూడా
మా అవసరం వాళ్ళకి ఉన్న సమయంలో స్పందించగలగాలని...
ఆ పరిస్థితులను మాకు ఇమ్మని దేవుడిని కోరుకుంటాము.
MANCHI VISHAYAM CHEPPAARU. ILAAGE ANTUNNAARANDEE!EE MADHYA ILAA VINADAM YEKKUVAIPOYINDI.
kastephale గారూ ..మంచి ప్రశ్న..
దీనికి సమాధానం కూడా అందరికీ తెలిసిందే కదా!
రాజీ మీ కోరిక దేవుడు తప్పకుండా తీరుస్తాడు..
థాంక్యూ వనజ వనమాలి గారూ
ప్రస్తుత పరిస్తితి అలాగ వుందండీ..
మంచి టాపిక్ అండి . కాని దానికి సరైనా సొల్యూషన్ లేదు . ఎంత పిల్లల మీద ఆధారపడకుండా తమంత తామే వుందామనుకున్నా కొన్ని సార్లు తప్పని పరిస్తుతులు వస్తాయి . అప్పుడు ఆ తల్లితండ్రులగతి ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి .
థాంక్యూ మాలా కుమార్ గారూ
మీరు చెప్పింది నిజమేనండీ
అలాంటి తప్పని పరిస్తితుల్లో అర్ధం చేసుకుని తల్లిదండ్రులకి సహాయం చేసే పిల్లలు ఉండటం
చాలా అదృష్టం అనుకుంటాను.
నాని గారూ మంచి విషయం గురించి స్పందించారు..బాగుంది.
నేను కూడా అమ్మ గురించి ఒక హిందీ కవిత నా బ్లాగ్ లో పెట్టాను చూడండి..
Post a Comment