RSS

మట్టి గాజులు.


నిన్న మా పిల్లలు ఇద్దరు బజారు కెళ్ళి వాళ్లకు ఇష్టమైన గాజులు,ఇంకా వాళ్లకి అవసరమైన క్రీమ్స్ ఇంకా ఏవేవో తెచ్చుకున్నారు. వాటిని అన్ని టేబుల్ మీద పరుచుకుని ఎవరెవరు ఏమి తెచ్చుకున్నారో నాకు చూపిస్తూ మాట్లాడు కుంటున్నారు. నా చిన్నతనంలో గాజులు వేయించుకోవటం ఒక పెద్ద యుద్ధమే .నేను,మా పెద్దక్క అమ్మ గాజులు వేయించుకోమంటే వే వేయించుకొనే వాళ్ళం.మా రెండో అక్క మాత్రం గాజుల మూట మొత్తం చూపించినా గాజులు నచ్చేది కాదు. చాలాసేపు వెతికించేది.మా ఇద్దరు చెల్లెళ్ళు మాత్రం సెలెక్షన్ తొందరగానే చేసేవాళ్ళు.

మేము చిన్నపుడు గాజులు ఒక తెల్లటి గుడ్డలో మూట కట్టి దాన్ని భుజానికి రెండు వేపుల తగిలించుకుని,గాజుల వీరయ్య వచ్చే వాడు అతని కేక వినగానే
వీధిలోని పిల్లలు అతని వెంట కేకలు వేస్తూ బయలు దేరేవాళ్ళు.. గాజుల వీరయ్య రాగానే ఇంటిల్లపాది,వీధి ,వీధీ సందడి మొదలుతుంది.చిన్న పిల్లలు మొదలు కొని పండు ముత్తైదువుల వరకు అతని చుట్టూ చేరి తమకుసరి పోయే సైజు ,నచ్చిన రంగు వెతుక్కుంటూ చాల సందడిగా వండేది .అతని చేతులతోనే గాజులు వేయించుకుని అతనికి ,గాజుల మలారం కు నమస్కరించి అక్కడి నుంచి లేచేవాళ్ళు.. అది అప్పటిలో ఒక సాంప్రదాయం.

మహిళలు ధరిస్తున్న గాజులు వాటి ప్రాముఖ్యాన్ని ,ఆదరాన్ని కోల్పోలేదు సరి కదా వాటిలో అనేక కొత్త కొత్తరూపాలు,రంగులూ వచ్చాయి . మన జీవితంలో పెళ్లి కి ఉన్న ప్రాముఖ్యత ఎంతో గాజులకి కూడా అంత
ప్రాముఖ్యత ఉన్నది .పెళ్లినాటి ఉదయం గాజులు తొడిగే కార్యక్రమం ఉంటుంది. .చేతులకు గాజులు తొడిగే సరైన సమయాన్ని పూజారి నిర్ణయిస్తారు..దీన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తాము.

పెళ్ళిలో
నిండుగా గోరింటాకు పెట్టుకుని ముఖ్యంగా పెళ్ళిలో ఉపయోగించే ఎరుపు,ఆకుపచ్చ రంగుల గాజులతో మెరిసి పోయే వధువు చేతి గాజుల గలగలలు,పెళ్లి మంత్రాలు ,సన్నాయి మేళాలు కలగలసి వాతావరణము చాలా బాగుంటుంది.ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా వాటి మధ్యలో కొన్నైనా మట్టి గాజులు వేసుకోవటం
ముత్తైదువులకు సౌభాగ్యాన్ని,అందాన్ని ఇస్తుంది.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

9 వ్యాఖ్యలు:

Anonymous said...

Mee pillalaku inka gaajulu veskune alavaatu undadamu, asalu gaajula pai aada vaariki unna aasakthi peragadamu gamanaarhamu.

రాజ్యలక్ష్మి.N said...

"నాని" గారూ.. నిజమేనండీ
ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా
మట్టిగాజుల అందమే వేరు..
నాకు కూడా మట్టిగాజులు ఇష్టం..

మాలా కుమార్ said...

నాకూ మట్టిగాజులంటే చాలా ఇష్టమండి . అసలు మధ్యలో మట్టిగాజులు లేకుండా బంగారం గాజులు వేసుకోకూడదట.

బాగుంది మీపోస్ట్ .

నాని.నామాల said...

YRK గారూ Thankyou.
మా పిల్లలే కాదండీ ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు మట్టిగాజులు వేసుకుంటున్నారు.
మన భారతీయ మహిళలు ఎప్పటికీ మర్చిపోని సంస్కృతిలో ఒక భాగమది.

నాని.నామాల said...

రాజి థాంక్సండీ..
మీరు చెప్పింది నిజమే..
ఎన్ని బంగారు గాజులున్నా మట్టి గాజుల అందమే వేరు.

నాని.నామాల said...

మాలా కుమార్ గారూ పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ.
అవునండీ మట్టిగాజులు తో కలిపి బంగారు గాజులు వేసుకోవాలట.
మీ అభిప్రాయం తెలియచేసినందుకు చాలా సంతోషం.

వనజ తాతినేని/VanajaTatineni said...

నాని గారు..ఈ పోస్ట్ ..గాజులు చూడగానే చాలా సంతోషం వేసింది తెలుసా! నేను రోజు మట్టి గాజులే వేసుకుంటాను. మన సంప్రదాయం అంటే మక్కువ కాబట్టి. నిజంగా మట్టి గాజులు యెంత బాగుంటాయో! అలాగే బంగారపు గాజుల మధ్య మట్టి గాజులు..కూడా..
మీ పిల్లలకి గాజులు వేసుకునే అలవాటు.. చాలా అందమైనది. అందరి పిల్లలు ఆచరించ తగినది.

నాని.నామాల said...

వనజవనమాలి గారూ..పోస్ట్ నచ్చినందుకు చాలా సంతోషమండీ..
మన సాంప్రదాయం అంటే నాకు కూడా చాలా ఇష్టం..
అందుకే ఈ పోస్ట్ పెట్టాను..
ఇంక మా పిల్లలు కూడా నా మాటకు విలువ ఇచ్చి మన సాంప్రదాయాల్నే వాళ్ళు కూడా అనుసరించటం నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది..
మీ స్పందన తెలియచేసినందుకు చాలా థాంక్స్..

రసజ్ఞ said...

బాగుందండీ! చక్కగా చెప్పారు! నేను కూడా ఒకసారి దీని గురించి వ్రాశాను! వీలున్నప్పుడు చూడండి!
http://navarasabharitham.blogspot.com/2011/10/blog-post_17.html

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...