
నింగీ నేల మాదే అంటూ అన్ని రంగాలలో తనదైన ముద్ర వేస్తూ,తమ ప్రతిభను చాటుకుంటున్న
మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ మహిళా దినోత్సవాన్ని అందరూ చాలా బాగా జరుపుకున్నారు,
అందరూ ఎవరికీ తోచినట్లు వాళ్ళు శుభాకాంక్షలు అందించుకున్నారు.
అలాగే వాళ్ళ జీవితాల్లో ముఖ్యమైన మహిళలకు కృతఙ్ఞతలు తెలియచేసుకున్నారు.
ఇందులో భాగంగానే "వనితా టీ.వీ" వాళ్ళు నిర్వహించిన ఒక కార్యక్రమం
"నను వెలిగించిన వనిత"ఈ కార్యక్రమం గత 3 రోజులుగా వనితా టీవీలో వస్తుంది..
ఎవరైనా సరే యాంకర్ కి ఫోన్ చేసి తమ జీవితంలో వాళ్ళ ఉన్నతికి కారణమైన మహిళలు ఎవరైనా
వాళ్ళు అమ్మైనా కావచ్చు,భార్య కావచ్చు ఇలా మీ జీవితం లో మిమ్మల్ని వెలిగించిన వనిత ఎవరో
మీ అనుభవాలను మాతో పంచుకోండి అని అడిగారు..
కొంత మంది ఫోన్ చేసి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దిన మహిళలకి కృతఙ్ఞతలు తెలియచేశారు.
ఈ ప్రోగ్రాం లో చాలా మంది జీవితాన్ని వెలిగించిన వనిత గురించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో
ఎందరో వివిధ రంగాలలో ఉన్నత స్థానం లో ఉన్నవాళ్ళు,సామాన్యులు, స్పందించి వాళ్ళను
వెలిగించిన వనితను గురించి లోకానికి తెలియచేసి,వాళ్లకి కృతఙ్ఞతలు తెలియచేశారు.
ఇందులో మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళ ఉన్నతికి కారణమైన మహిళలకు
కృతజ్ఞతలను తెలియ చేసి,మహిళా దినోత్సవ శుభాకాంక్షలను అందించారు...
నేను కూడా నా జీవితంలో సంసారాన్ని చక్కదిద్దుకోవటం,పిల్లల పెంపకం వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దటం
ఇవన్నీ నేర్పిన మా అమ్మకి నేను కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కృతఙ్ఞతలు
తెలియ చేస్తున్నాను.
ఈ విషయాలన్నీ మీ అందరితో పంచుకునేలా నాకు బ్లాగ్ గురించి తెలియచేసి,ఎలా రాయాలి,
మనసులో ఉన్న అభిప్రాయాలని తెలియ చెయ్యటం ఎలా అని,నేను చేసే వంటలు నచ్చి,
ఆ వంటలకు కూడా ఒక బ్లాగ్ క్రియేట్ చేసి,నా జ్ఞాపకాలను,అనుభూతులను పదిలపరచుకునే
ఒక వేదికగా ఈ బ్లాగ్ లు రాయటానికి అన్ని విధాలా సహకరిస్తున్న నా అమ్ములుకి
మహిళా దినోత్సవం సందర్భంగా నా ప్రత్యేక శుభాకాంక్షలు.
ప్రతి మనిషి విజయం వెనుక ఒకరు తప్పకుండ ఉన్నట్లు "నా జీవనగమనంలో"
పోత్సహిస్తూ నన్ను వెలిగించిన వనిత నా "అమ్ములు" I Love You.
Showing posts with label మహిళా దినోత్సవం. Show all posts
Showing posts with label మహిళా దినోత్సవం. Show all posts
"నను వెలిగించిన వనిత"
11:11 PM |
లేబుళ్లు:
మహిళా దినోత్సవం
Happy Women's Day
Read User's Comments(2)
Subscribe to:
Posts (Atom)







