RSS
Showing posts with label యద్దనపూడి సులోచనారాణి. Show all posts
Showing posts with label యద్దనపూడి సులోచనారాణి. Show all posts

నా అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి



నాకు నవలలు చదవటం ,సేకరించటం హాబీ .నేను చదువుకునే టైం లో సెలవులు వస్తే
మా పెద్దనాన్న కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని .
మా అక్కకి కూడా నాలాగే నవల్స్ అంటే చాలా ఇష్టం..మా అక్క ఎమెస్కో బుక్ క్లబ్ లో మెంబర్.
అక్కా వాళ్ళ ఇంట్లో నవల్స్ పెద్ద పెద్ద అలమరల్లో పెట్టి ఉండేవి .
అక్కదగ్గర ఎక్కువగా
యద్దనపూడి సులోచనారాణి , కోడూరి కౌసల్యాదేవి, యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల్స్ ఉండేవి
నేను వెళ్ళిన దగ్గరి నుండి మరలా ఇంటికి వచ్చేదాకా అవే చదువుకుంటూ వుండేదాన్ని...
ఆవిధంగా నాకు నవల్స్ మీద ఇష్టం ఏర్పడింది..


ఆవిధంగా మొదలైన నా పఠనాసక్తి నా పెళ్లి అయిన తరువాత కూడా కొనసాగింది..
నేను కూడా ఎమెస్కో లో లైఫ్ టైం మెంబర్ ని..
తరువాత
నా సొంత లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాను. నా దగ్గిర ఇపుడు
యద్దనపూడి ,యండమూరి,కోడూరి కౌసల్య కొమ్మనాపల్లి గణపతిరావు,బలభద్ర పాత్రుని రమణి,
వంశీ,మీరా లక్ష్మి , ఇంకా నాకు నచ్చిన చాలా మంది రచయితల పుస్తకాలు,
ఎమెస్కో వారు నెలనెలా ప్రచురించే కొత్త రచయితల పుస్తకాలు నా సేకరణలో వున్నాయి..

యద్దనపూడి రచనలంటే మా ఇంట్లో అమ్ములుకి, నాకు చాలా ఇష్టం.
ఆవిడ రచనలు చదువుతున్నంత సేపు పాత్రల్లో, పరిస్థితుల్లో లీనమైపోతాము..
ఆవిడ రచనలో ఒక మద్య తరగతి అమ్మాయి తన వ్యకిత్త్వం ,ఆత్మవిశ్వాసం,
హుందాతనంతో ,ఎంతటి కోటీశ్వరుడైన హీరో అయినా నాయికను ఇష్టపడి ప్రేమించే విధంగా రాస్తారు.

ఆవిడ రాసిన ఋతువులు నవ్వాయి,జీవనతరంగాలు,కీర్తికిరీటాలు,మీనా,శ్వేతగులాబి,
సెక్రటరి,ఆత్మీయులు ఇలా ఇవేమిటి ఎన్నో ఆవిడ నవల్స్ అంటే నాకు చాల పిచ్చి అనే చెప్పాలి.
ఎంతైనా ఆవిడ నవల్స్ లో లాగా తమని తాము అమ్మాయిలు ఊహించుకునే టైంలో అమ్మాయినే కదా నేను కూడా

నేను ఆవిడ నవల్స్ చాలావరకు సేకరించాను.ప్రతి పెళ్లీడుకొచ్చిన అమ్మాయి తనకు కాబోయే జీవితభాగస్వామి
ఆవిడ నవలా నాయకుడి లాగా వుండాలని కోరుకునే వాళ్ళంటే అతిశయోక్తి కాదు..

ఆవిడ రచనలు చదువుతుంటే మనకు తెలియకుండానే మన పెదాల మీదకు చిరునవ్వు వస్తుంది
కొన్ని సన్నివేశాల వర్ణనలో.. నవల్స్ లో ఇంటివర్ణన,ప్రకృతి వర్ణన కళ్ళకు కట్టినట్లుగా ఉంటుది

ప్రతి నోవెల్ లో హీరోకి,హీరోయిన్ కి వివాదం కానీ చివరికి హీరొయిన్ నే గెలిపిస్తుంది.
ఆవిడ రాసిన రచనలు కొన్ని సినిమాలుగా వచ్చాయి...
అందులో మీనా,జీవన తరంగాలు,సెక్రటరీ,ఆత్మీయులు,రాధాకృష్ణ,అగ్నిపూలు,ఆరాధన
నాకు చాలా ఇష్టమైనవి.
సినిమాల CD లు నా CD కలెక్షన్ లో ఉన్నాయి ...
ఇంకా నాకు చాలా ఇష్టమైన నవల " దేశం మాకేమిచ్చింది"
ఆవిడ నవల్స్ ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు అని చెప్పలేను..
కొండ ఎంత పెద్దదైనా అద్దంలో చిన్నగా కనిపించినట్లు ఆవిడ గురించి ఎంత వర్ణించినా ఎంత చెప్పుకున్న తక్కువే..
ఇవీ నా జీవనగమనంలో నా అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గారి ముచ్చట్లు..


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...