RSS
Showing posts with label నా చిన్ననాటి జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label నా చిన్ననాటి జ్ఞాపకాలు. Show all posts

మా చిన్ననాటి వేసవి ...

వేసవి వస్తూనే తన ప్రతాపం చూపిస్తూ వచ్చినా మధ్య కురిసిన వర్షాల వలన వాతావరణం కొంచెం చల్లబడింది.
పిల్లలకి సెలవలు వచ్చేసాయి..ఎక్కడ చూసినా వేసవి ప్రయాణాలు,హడావుడి కనిపిస్తుంది.మా పక్కింటి పద్మా గారింట్లో అమ్మమ్మ గారింటికి వెళ్ళే హడావిడి మొదలు అయ్యింది . మా పిల్లలు పెద్దవాళ్ళు అవటంచేత మా ఇంట్లో హడావిడి లేదు ఇంకా.మా పిల్లల చిన్నతనం లో సెలవలు చాల ఆనందంగా గడిసేవి.మాచెల్లి, పిల్లలు నర్సాపురం నుంచి వేసవి సెలవలకి మా ఇంటికే వచ్చే వాళ్ళు. మాపిల్లలు,అందరితో బాగా కలసిపోయేవాళ్ళు.. వాళ్ళతో కలిసి ఎండల్లోనే ఆటలు, షికార్లు, వేసవి స్పెషల్ మామిడి కాయలు,అప్పట్లో వచ్చే పుల్ల ఐస్ లు తింటూ.. కాసేపు కొట్టుకుంటూ,తిట్టుకుంటూ, అంతలోనే మళ్ళీ కలిసిపోతూ ఇలా మే నెల అంతా మా అందరి ఇళ్ళూ చాలా సందడిగా ఉండేవి.


మా చిన్న తనంలో ఐతే మేము ఐదుగురు అక్కా చెల్లెళ్ళం ,అన్నయ్య ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అని చీటీలు వేసే వాళ్ళము.. ఎక్కువగా నేను మా పెదనాన్న గారి దగ్గరికి వెళ్ళేదాన్ని. అక్కడినుంచి మా పెద్ద అన్నయ్య దగ్గరికి ,మా పెద్దనాన్న పిల్లలే అయినా అక్క,అన్నయ్యలు నన్ను సొంత చెల్లి లాగా ప్రేమగా చూసేవాళ్ళు. సెలవలన్నీ అక్కడనే గడిపేదాన్ని..పెద్దక్క,బావతో కలిసి సినిమాలు చూడటం,దగ్గరలో వున్న ప్రదేశాలు చూసి రావటం ఒక నెల వేసవి సెలవలు తెలియకుండానే అయిపోయేవి..

ఒకసారి వేసవి సెలవలకి పెద్దమ్మ అంటే అమ్మ వాళ్ళ అక్క గారి
ఊరు వెళ్ళాము.. ఉరు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది ఒక చిన్న పల్లెటూరు. అక్కడికి వెళ్ళటానికి సరైన రవాణా మార్గం కూడా వుండేది కాదు. కొంత దూరం బస్సు ప్రయాణం , తరువాత ఎద్దుల బండి మీద వెళ్ళాలి.. చాలా మంది కాలి నడకన ఉరు వెళతారు. అనుకున్నట్లు గానే ప్రయాణం రోజు వచ్చింది.. ముందు రోజున అమ్మ మా అందరి బాగ్స్ సర్ది పెట్టినది. నేను నిద్ర లేచే సరికి మా ఇంటి ముందు బాగా అలంకరించిన ఎద్దులతో ఉన్న బండి ఆపి ఉన్నది. దానిని చూడ గానే అన్నయ్య ,మా పెద్దక్క ,మూడో చెల్లి చాలా ఆనందంగా ప్రయానికి సిద్ధమయ్యారు.. అందరం హుషారుగా రెడీ అయిపోయి..అమ్మ,నాన్నచెప్పే జాగ్రత్తలతో బండి చాల హుషారుగా కదిలినది. దారి పొడుగునా పచ్చటి చెట్లు, తాటిముంజల కాయలతో నిండిన తాటి చెట్లు, బండి నడిపే అబ్బాయి కూనిరాగాలు ఉదయాన్నే ప్రయాణం కావటంతో వాతావరణం చాలచాల్లగా హాయిగా ఉంది. మాకు ఎద్దుల బండి ప్రయాణం చాలా సరదాగా ఉండేది.మేము మా అన్నయ్య తో ఎద్దులని ఇంకా స్పీడ్ గా పరిగెట్టించమంటే మా అన్నయ్య (పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి) ఒద్దు అవి పందెపు ఎద్దులు ,అట్లా రెచ్చగొడితే ప్రమాదం అని చెప్పాడు.


అలా
మా ప్రయాణం సాగి తొందరగానే ఇల్లు చేరాము.. ఇంటి ముందు ఆగగానే పెద్దమ్మ కూతుర్లు , పక్కింటి వాళ్ళు వచ్చి టౌన్ నుంచి వచ్చిన పిల్లలం కాబట్టి అందరూ ఆసక్తిగా చూస్తూ.మమ్మలిని ఆప్యాయంగా పలకరిస్తూ ఇంట్లోకి తీసుకెళ్ళారు. మా పెద్దమ్మ వాళ్ళ ఇళ్ళు చాలా పెద్దవి.. ఇంట్లోనే పెద్ద పెద్ద ధాన్యపు గాదెలు ఉండేవి.వాటి నిండా ధాన్యాన్ని నిల్వ చేసేవారు.ఇంట్లో ఆవులు,ఎద్దులు,గేదలు ఇలా పశు సంపద అంతా వుండేది... వీటన్నిటి కోసం పెద్ద పశువుల కొష్టాలు ఉండేవి వాటి కోసం ప్రత్యేకంగా జీతగాళ్ళు వుంటారు.వీళ్ళకి జీతాలు కూడా ఆరోజుల్లో చాలా తక్కువగా ఉండేవి.
సంవత్సరానికి ఒకసారి జీతాలు,బట్టలు పెట్టేవాళ్ళు. కానీ రోజూ మాత్రం మా పెద్దమ్మ ఇంట్లోనే జీతగాళ్ళకి చల్లని మజ్జిగతో అన్నం పెట్టేది.ఇలా మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లంతా ఇంట్లో మనుషులు,పశువులు,వచ్చే పోయే బంధువుల తో
ఎప్పుడూ చాలా హడావుడిగా ఉండేది..

మేము ఇంటికి వెళ్ళగానే భోజనాల కార్యక్రమం.
. మా పెద్దమ్మ మమ్మల్ని అందరినీ భోజనం కోసమే కేటాయించిన పడమటి ఇంట్లో కూర్చో పెట్టి,మా అందరికీ వడ్డించింది.భోజనం లో వాళ్ళ మోట బావి కింద చేలో పండించిన వడ్ల బియ్యం అన్నం,ముద్ద పప్పు,ఇంట్లో అప్పుడే కొత్తగా పెట్టిన రకరకాల పచ్చళ్ళు( నాకు ఇష్టమైన కొత్త మామిడి కాయ పచ్చడి)
ఇంట్లో గేదె పాల తో వచ్చిన మీగడతో ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి వేసి ,చివరిలో గడ్డపెరుగుతో మళ్ళీ మళ్ళీ వడ్డిస్తూ మా భోజనం పూర్తయ్యింది..

మరుసటి రోజు తెల్లవారగానే అందరు తొందరగా రెడీ ఐతే మీ అందరిని తాటి తోపుకి తీసుకెళతాను అని మాపెద్దమ్మ కొడుకు చెప్పాడు.. మేము నలుగురం, మా పెద్దమ్మ కూతుర్లు,పెద్దన్నయ్య అందరం కలిసి వెళ్ళాము.. చాలాపెద్ద తోట అది అందులోనే సగం మామిడి తోట,సగం తాటి తోపు..ఇందులోనే ఇంటికి అవసరమైన కూరగాయలు కూడా పండించే వాళ్ళు. తాటి తోపు లోకి వెళ్లి అన్నయ్య తాటి ముంజలు కొట్టించి ఇచ్చాడు. అప్పటికప్పుడు చెట్టు మీద నుంచి కొట్టినవి కావటం తో తాటి ముంజలు చాల లేతగా తియ్యగా,అందులో చల్లటి నీళ్ళతో చాలా బాగుండేవి..
మాతోట వెంబడే చంద్రవంక అని ఒక వాగు పారుతుండేది. అందులో మా అన్నయ్య లు ఇద్దరు ఈత కొట్టేవాళ్ళు..

మాతో పాటూ వచ్చిన జీతగాళ్ళు తాటి మట్టలు, ముంజలు తీసిన తాటి కాయలతో గాన్లు లాగా బండి తయారుచేసి మమ్మలిని బండి మీద ఎక్కించుకుని లాగే వాళ్ళు. అలా సాయంత్రం దాకా ఎండా కూడా తెలియకుండా తోటల్లో ఆడుకుని,ఇంటికొచ్చేటప్పుడు కావాల్సినన్ని తాటిముంజలు, మామిడి కాయలు కోసుకొచ్చుకున్నాము..ఇలా మా సెలవలన్నీ అక్కడ చాలా సరదాగా,సంతోషంగా గడిపి మేము ఇంటికి వచ్చేదాకా మా పెద్దమ్మ పిల్లలు,పెద్దన్నయ్య మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఒక్క బయటి మనిషి భోజనానికి వస్తేనే ఎంతో ఇబ్బంది పడుతుంటారు.. కానీ రోజుల్లో ఇంట్లో ఎంతమంది ఉన్నా,ఎంతమంది బయటి వాళ్ళు వచ్చినా విసుగు లేకుండా పెద్ద పెద్ద పాత్రల్లో వండి వడ్డించే అప్పటి వాళ్ళ ఆప్యాయత ఇప్పుడు లేదు,రాదు కూడా!!


మేము ఇంటికి వచ్చేటప్పుడు మాకు చాలా తాటిముంజలు,మామిడికాయలు,వేరుశనగకాయలు ఇచ్చి పంపేవారు.మరల మమ్మలిని అదే బండిలో ఇంటికి పంపించారు. అక్కడ గడిపిన మా సెలవలన్నీ మాకు మరిచిపోలేనంత సంతోషాన్ని కలిగించాయి..అప్పుడు అనిపించింది నాకు మా అన్నయ్య ,అక్కలు సెలవలకు అక్కడికి ఎందుకు వెళదామంటారో !!. నిజంగా అప్పుడు తిరిగిన తోటలు,చేలు,చెరువు గట్లూ, ఆప్యాయతలు జన్మలో మరచిపోలేము. రోజులు మరల రావు.. అందుకే వాటిని గుర్తు చేసుకోవటం .. అదొక ఆనందం.

ఇప్పటి రోజుల్లో పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు దూరమయ్యాయి..చదువులు,ఎగ్జామ్స్,అవి అయిపోగానే పోటీ పరీక్షలు,కొద్ది టైం వుంటే కంప్యూటర్ వీడియో గేమ్స్ ఇవే ప్రస్తుతం పిల్లల వేసవి సరదాలు..మారుతున్న కాలాన్ని బట్టి అన్నీ మారాయి.. అలాగే వేసవి సరదాలు కూడా...

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

మట్టి గాజులు.


నిన్న మా పిల్లలు ఇద్దరు బజారు కెళ్ళి వాళ్లకు ఇష్టమైన గాజులు,ఇంకా వాళ్లకి అవసరమైన క్రీమ్స్ ఇంకా ఏవేవో తెచ్చుకున్నారు. వాటిని అన్ని టేబుల్ మీద పరుచుకుని ఎవరెవరు ఏమి తెచ్చుకున్నారో నాకు చూపిస్తూ మాట్లాడు కుంటున్నారు. నా చిన్నతనంలో గాజులు వేయించుకోవటం ఒక పెద్ద యుద్ధమే .నేను,మా పెద్దక్క అమ్మ గాజులు వేయించుకోమంటే వే వేయించుకొనే వాళ్ళం.మా రెండో అక్క మాత్రం గాజుల మూట మొత్తం చూపించినా గాజులు నచ్చేది కాదు. చాలాసేపు వెతికించేది.మా ఇద్దరు చెల్లెళ్ళు మాత్రం సెలెక్షన్ తొందరగానే చేసేవాళ్ళు.

మేము చిన్నపుడు గాజులు ఒక తెల్లటి గుడ్డలో మూట కట్టి దాన్ని భుజానికి రెండు వేపుల తగిలించుకుని,గాజుల వీరయ్య వచ్చే వాడు అతని కేక వినగానే
వీధిలోని పిల్లలు అతని వెంట కేకలు వేస్తూ బయలు దేరేవాళ్ళు.. గాజుల వీరయ్య రాగానే ఇంటిల్లపాది,వీధి ,వీధీ సందడి మొదలుతుంది.చిన్న పిల్లలు మొదలు కొని పండు ముత్తైదువుల వరకు అతని చుట్టూ చేరి తమకుసరి పోయే సైజు ,నచ్చిన రంగు వెతుక్కుంటూ చాల సందడిగా వండేది .అతని చేతులతోనే గాజులు వేయించుకుని అతనికి ,గాజుల మలారం కు నమస్కరించి అక్కడి నుంచి లేచేవాళ్ళు.. అది అప్పటిలో ఒక సాంప్రదాయం.

మహిళలు ధరిస్తున్న గాజులు వాటి ప్రాముఖ్యాన్ని ,ఆదరాన్ని కోల్పోలేదు సరి కదా వాటిలో అనేక కొత్త కొత్తరూపాలు,రంగులూ వచ్చాయి . మన జీవితంలో పెళ్లి కి ఉన్న ప్రాముఖ్యత ఎంతో గాజులకి కూడా అంత
ప్రాముఖ్యత ఉన్నది .పెళ్లినాటి ఉదయం గాజులు తొడిగే కార్యక్రమం ఉంటుంది. .చేతులకు గాజులు తొడిగే సరైన సమయాన్ని పూజారి నిర్ణయిస్తారు..దీన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తాము.

పెళ్ళిలో
నిండుగా గోరింటాకు పెట్టుకుని ముఖ్యంగా పెళ్ళిలో ఉపయోగించే ఎరుపు,ఆకుపచ్చ రంగుల గాజులతో మెరిసి పోయే వధువు చేతి గాజుల గలగలలు,పెళ్లి మంత్రాలు ,సన్నాయి మేళాలు కలగలసి వాతావరణము చాలా బాగుంటుంది.ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా వాటి మధ్యలో కొన్నైనా మట్టి గాజులు వేసుకోవటం
ముత్తైదువులకు సౌభాగ్యాన్ని,అందాన్ని ఇస్తుంది.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

వీరయ్య - కోటేశ్వరి



ఒక రోజు నేను స్కూల్ నుంచి వచ్చే సరికి మా రెండో ఇంట్లో నుంచి సందడి వినిపించింది .
మా
అమ్మను ఎవరు అని అడిగాను. మన ఇంటిలోకి అద్దెకి వచ్చారు అని చెప్పింది.
ఉదయాన్నే
నేను స్కూల్ కెళ్లాలని బయటికి వచ్చినప్పుడు మా ఇంటి ముందు ఒక సైకిల్ దాని దగ్గర ఒకతను.
మాఇంట్లో
కి అద్దెకి వచ్చింది వీళ్ళేనేమో అనుకోని స్కూల్ కి వెళ్లాను .
రీసెస్
పిరియడ్ లో స్కూల్ బయటి కొచ్చిన నేను అక్కడ k.c.p ఫాక్టరీ వర్కర్స్ కోసం కట్టిస్తున్న
ఇండ్ల దగ్గర మా ఇంట్లో రెంట్ కొచ్చినతను... అక్కడి వర్కర్స్ కి సూచనలు ఇస్తున్నారు .
నన్ను
చూసి స్కూల్ లోన నీవు చదువు కొనేది అని అడిగారు.

నేను చాల తొందరగా ఇంటి కొచ్చి మా అమ్మకు విషయం చెప్పాను.
అవును
అతను సివిల్ ఇంజినీర్ ఇక్కడి సిమెంట్ ఫాక్టరీలో ..మీ స్కూల్ దగ్గిరే అని చెప్పింది.
ఇంక
ఆయన భార్య పేరు కోటేశ్వరి . చాల అందంగా ఉండేది. మెడ నిండా నగలు,
చేతులకు
బంగారు గాజులతో చాల బాగుండేది.
చాల
తొందరలోనే వాళ్ళతో మాకు చనువు ఏర్పడింది. మేము వాళ్ళని అన్నయ్య ,వదినా అని పిలిచే వాళ్లము..
వాళ్ళు
ఇంగ్లీష్ పేపర్,మేము తెలుగు పేపర్ తెప్పించే వాళ్ళం.
అది
చూచి చదువుకునే పిల్లలు ఇంగ్లీష్ పేపర్ చదవాలి అని చెప్పి వాళ్ళ పేపర్ మాకిచ్చేవాళ్ళు.
మధ్యాహ్నం
పూట అమ్మ ,పెద్ద అక్క ,మా అన్నయ్య అందరితో కలసి వదిన అష్టా చెమ్మా ఆడేవాళ్ళు.
అన్నయ్య
నన్ను సైకిల్ మీద స్కూల్ కి తీసుకెళ్ళేవారు.

వాళ్ళు
మాతో చాలా బాగా కలసి పొయ్యారు. కొన్నాళ్ళకి అన్నయ్య కి గాజువాక స్టీల్ ప్లాంట్ లో
జాబు
వచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళినతరువాత చాల రోజులు లెటర్స్ రాసేవాళ్ళు.
ఒకసారి
నాన్న అన్నయ్య వెళ్లి వచ్చారు. ఇప్పటికి అన్నయ్య రిటైర్ అయ్యి ఉండొచ్చు ...
ఎంత
మంది పిల్లలో ఎలా వున్నారో??
మంచి
వాళ్ళని ఎన్ని సంవత్సరాలు అయినా మరచి పోలేము.
అన్నయ్య పేరు వీరయ్య వదిన పేరు కోటేశ్వరి


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

మేము - మా అన్నయ్య


అన్నయ్య అందరికంటే పెద్ద వాడవటంతో అవసరమైన బయటి పనులన్నీ తనే చేసేవాడు.
చదువులో కూడా మాకు సలహాలు చెప్పేవాడు. మేము వాడుకొనే మంచి నీళ్ళు బావి నుంచి తెచ్చుకునే వాళ్ళం.
ఇంట్లో కావలసినన్ని నీళ్ళు అన్నయ్య ఒక్కడే తెచ్చేవాడు..

మేము స్కూల్ కి వెళ్ళాలన్నా ఏదన్న సినిమా కెళ్లాలన్నా అన్నయ్య మా వెంబడి వచ్చి
మరల జాగ్రత్తగ తీసుకోచ్చేవాడు.మా అందరిని చాల ప్రేమగా చూసేవాడు .
మా అందరికీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా అదే ప్రేమతో ఉన్నాడు.
మా పెద్దక్క చాల అమాయకురాలు...తనకి చాల చిన్న వయసులోనే పెళ్లి జరిగినది .
రెండవ అక్కకి కూడా అంతే .తరువాత నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకొనేటప్పుడు పెళ్లి జరిగినది.
మావారు అమ్మకు కొద్దిగా దూరపు బంధువులు..
వాళ్ళ అమ్మ పుట్టుంటి వూరు అంతే మా అమ్మమ్మ వాళ్ళ వూరు.
మావారు అమ్మని ,మమ్మలందరినీ చాల ప్రేమగా చూసేవారు.
నా పెళ్లి,అన్నయ్య పెళ్లి ఒకేసారి జరిగినది.
కాని ఏడాదికే నాన్న హార్ట్ అట్టాక్ తో చనిపోయారు. తరువాత కుటుంబ బాధ్యత అమ్మ ,అన్నయ్యది.
మిగిలిన ఇదరు చెల్లెళ్ళకు కూడా బాగానే కట్న కానుకలతో అమ్మ,అన్నయ్య పెళ్లి చేశారు .
ఇది మాఆరుగురి గురించి . మా అందరికి పిల్లలు.

అమ్మ చాలాబాగా పాటలు పాడేది. దేవుడి పాటలు,భజన్స్ చాలా ఇష్టం .
తెల్లవారుజామునే లేచి భక్తి గీతాలు కూనిరాగాలు పాడుకుంటూ పనులు చేసుకునేది.
మాఇంట్లో చాల పెద్ద తులసి కోట ఉండేది .పసుపు ,కుంకుమ తో చాల అందంగా వండేది.
తులసి కోట చుట్టూ ఎర్ర మట్టి తో అలికి ,దాని పైన తెల్లటి ముగ్గుతో అలంకరించేది.
అదేఅలవాటు ఇపుడు మా అందరికి వచ్చినది..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నేను -నా కుటుంబం


మాది పెద్ద కుటుంబం అనే చెప్పు కోవాలి .మా ఇంట్లో మా నాన్న,అమ్మ అన్నయ్య , ఇద్దరు అక్కలు, నేను ,ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవాళ్ళం . అయినా మాకు ఏలోటు లేకుండా పెంచారు అమ్మ,నాన్న .
మా
అన్నయ్య ,రెండో అక్క అమ్మతో ఎక్కువప్రేమగా ఉండే వాళ్ళు. నేను చిన్నచెల్లి నాన్న మీద ప్రేమ .
మా
మొదటి చెల్లి మా అందరినే డామినేట్ చేసి అందరిని బెదిరించేది.

మా
కుటుంబాన్ని అంతటినీ అమ్మ ఎంతో ఓపికగా ఎవరి అవసరములు ఏమిటో
కనుక్కుని
పనులన్నీ చేసేది .ఉదయాన్నే స్కూల్ కెళ్లటానికి రెడీ చేయటం ఒక ప్రళయం .
మా
ఐదుగ్గురికి చాల పెద్ద జుట్టు .అమ్మ వరసన జడలు వేసి వరసన స్నానాలు చేయించేది..
మాకు
ఒకోకరికి రెండు సం తేడ అవటంతో మా అందరి పనులు అమ్మ ఒక్కటే చేయలిసి వచ్చేది.
మా
ఉరు లో ఇప్పటికీ చిన్నకాన్వెంట్ గాపిలిచే స్కూల్ కి బయలు దేరేవాళ్ళం. అన్నయ్య హైస్కూల్ కి వెళ్ళేవాడు .
మా
అందరిలో రెండో అక్క కి అమ్మ మీద ప్రేమ ఎక్కువ అని చెప్పా కదా అది చదువుకోవటం కష్టం అనిపించి
అమ్మ
పనులు ఎక్కువ అయ్యి చేయలేక బాధ పడుతుంటే చూడలేను అని తొమ్మిదితో మాని వేసింది .
అది
అమ్మ ,నాన్న ద్రుష్టి లో చాల ప్రేమ కలది .

పండగ
వచ్చిందంటే మాఇంట్లో సందడి అందరమూ బట్టలు కుట్టించుకోవటంతో మొదలవుతుంది.
ఇప్పుడు
తలచుకొంటె చాల నవ్వు వస్తుంది.. నాన్న,అన్నయ్య ఒకేరకం బట్టలు తెచ్చుకునేవారు..
ఇంక
మా అందరికీ ఒకే రకం గౌనులు,లంగాలు కుట్టించే వాళ్ళు.
చుట్టుపక్కల
వాళ్ళు బాండ్ మేళం అని నవ్వుకునే వాళ్ళు..
ఎంత
నవ్వుకున్నా పండగ రోజున అందరం కొత్త బట్టలు వేసుకుని,మా అమ్మవేసిన మా పెద్ద పెద్ద జడలలో
పెరట్లో
మా అమ్మ పెంచిన బంతి పూలతో కట్టిన పూలమాలలు పెట్టుకుని అమ్మ వెంట గుడికి వెళ్లి రావటం,
అమ్మ చేసిన పిండి వంటలు ఒకరిపై ఒకరు పోటీలు పడుతూ తినటం

ఇప్పటికీ
సందడి అంతా నా కళ్ళలో ఉన్నట్లే వుంటుంది.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...