ఈ ఉగాది చాలా సందడిగా సంతోషంగా చేసుకున్నాము.పిల్లలు,నేను అందరం ఉదయాన్నే పూజ చేసుకుని ఉగాది పచ్చడి తిన్నాము.మా వారు ఉదయాన్నే శివాలయానికి వెళ్లి నా పేరు మీద పూజ చేయించి వచ్చారు. ఎందుకంటే ఈ రోజు నా పుట్టినరోజు కూడా మరి.
నేను ఉగాది రోజే పుట్టానట..అందుకని మా అమ్మ ప్రతి సంవత్సరం వుగాదిరోజే నా పుట్టినరోజు చేసేది..అలాగే నాకు పెళ్లి అయ్యి,పిల్లలు పుట్టిన తర్వాత కూడా నా పుట్టినరోజున వచ్చి హడావుడి చేసేది...
ఉదయాన్నే పిల్లలు,మావారు నాకు చెప్పిన పుట్టిన రోజు శుభాకాంక్షలతో ఈ కొత్త సంవత్సరం మొదలయింది..మా ఇంటికి ఈ సంవత్సరం వచ్చిన కొత్త సభ్యులు మా చిన్న అల్లుడు, నా మనుమరాలు
ప్రతి ఉగాది నాడు మా ఇంట్లో రెండు పండుగలు..ఒకటి తెలుగు నూతన సంవత్సరం,రెండు నా పుట్టిన రోజు.. సాయంత్రం మా పిల్లలు,మావారు,మా అక్కయ్య పిల్లలు అందరి మధ్య కేకు కట్టింగ్ చేశాను.. మా ఇంట్లో ఈ ఖర నామ సంవత్సర ఉగాది చాలా సంతోషంగా మొదలైంది..
ఉగాది...నా పుట్టినరోజు...
అందరికి ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు:
Post a Comment