కనుబొమల నడుమ ఎర్రని బొట్టు పెట్టుకోవటం మన హైందవ సంప్రదాయం.
ఇంటికి వచ్చిన ఎ ముత్తైదువకైనా వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి పంపించటం మన ఆచారం.
బారతీయ మహిళా వివాహిత స్త్రీని ఆమె ధరించే బొట్టు,నగలు,వస్త్రధారణని బట్టి తెలుసుకొనగలుగుతాము..
ఆమె నుదుటిన పెట్టుకునే ఎర్రని కుంకుమ ఆమె వైవాహిక స్థితిని ప్రతిబింబిస్తుంది.
బొట్టు శక్తి స్వరూపంగా మన హైందవ సంప్రదాయంలో ఒక స్థానం వుంది . స్త్రీ నుదుటిన ఉన్నబొట్టు ఆమె భర్త కు
అన్ని విషయాలలో విజయాన్ని కలిగిస్తుందని ,అతడిని కాపాడుతుందని పురాణ కాలాల నుంచి ఉన్న నమ్మకము. మనము పెట్టుకున్న ఎర్రనికుంకుమ మనల్ని దుష్టశక్తుల నుంచి దరిద్రం నుంచి కాపాడుతుందని మన పూర్వీకుల ప్రగాఢ నమ్మకం.పాపిట ధరించే కుంకుమ తో స్త్రీని వివాహితురాలి గా గుర్తించ గలము.
ఎర్రని రంగు చాల శుభప్రదమైనదిగా భావిస్తాము. అందుకనే కుంకుమని ముత్తైదు స్త్రీ నుదుటి పై,
పాపిటి పైన పెట్టుకుంటాము.
గుండ్రటి బొట్టు సతి పార్వతి దేవి ల సంకేతము..అది మనకు సిరిసంపదలు కలిగిస్తుంది.
మన కుటుంబ సంక్షేమాన్ని,సంతానాన్ని కాపాడుతుందని మన పూర్వీకుల నమ్మకం.
దానిని మనం ఆచరిస్తున్నాము.
చిన్నపిల్లలు,పెళ్లి కానిపిల్లలు ఇప్పటి ఫాషన్ ప్రకారం రకరకాల స్టిక్కర్స్ పెట్టుకున్నా
వివాహితులు మాత్రం ఎర్రని కుంకుమ ధరించటమే బాగుంటుందని నా అభిప్రాయం..
శుభప్రదమైన కుంకుమబొట్టు ...
4:25 PM |
లేబుళ్లు:
ఆచారాలు-సంప్రదాయాలు
Subscribe to:
Post Comments (Atom)
2 వ్యాఖ్యలు:
నాని గారు.. కుంకుమ గొప్పదనాన్ని బాగా చెప్పారండీ..
నిజంగా కుంకుమ పెట్టుకుంటే వుండే కళ స్టిక్కర్స్ కి రాదు..
ThankYou raji garu
Post a Comment