RSS

"నను వెలిగించిన వనిత"


నింగీ నేల మాదే అంటూ అన్ని రంగాలలో తనదైన ముద్ర వేస్తూ,తమ ప్రతిభను చాటుకుంటున్న
మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ మహిళా దినోత్సవాన్ని అందరూ చాలా బాగా జరుపుకున్నారు,
అందరూ ఎవరికీ తోచినట్లు వాళ్ళు శుభాకాంక్షలు అందించుకున్నారు.
అలాగే వాళ్ళ జీవితాల్లో ముఖ్యమైన మహిళలకు కృతఙ్ఞతలు తెలియచేసుకున్నారు.

ఇందులో భాగంగానే "వనితా టీ.వీ" వాళ్ళు నిర్వహించిన ఒక కార్యక్రమం

"నను వెలిగించిన వనిత"
ఈ కార్యక్రమం గత 3 రోజులుగా వనితా టీవీలో వస్తుంది..
ఎవరైనా సరే యాంకర్ కి ఫోన్ చేసి తమ జీవితంలో వాళ్ళ ఉన్నతికి కారణమైన మహిళలు ఎవరైనా
వాళ్ళు అమ్మైనా కావచ్చు,భార్య కావచ్చు ఇలా మీ జీవితం లో మిమ్మల్ని వెలిగించిన వనిత ఎవరో
మీ అనుభవాలను మాతో పంచుకోండి అని అడిగారు..
కొంత మంది ఫోన్ చేసి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దిన మహిళలకి కృతఙ్ఞతలు తెలియచేశారు.

ఈ ప్రోగ్రాం లో చాలా మంది జీవితాన్ని వెలిగించిన వనిత గురించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో
ఎందరో వివిధ రంగాలలో ఉన్నత స్థానం లో ఉన్నవాళ్ళు,సామాన్యులు, స్పందించి వాళ్ళను
వెలిగించిన వనితను గురించి లోకానికి తెలియచేసి,వాళ్లకి కృతఙ్ఞతలు తెలియచేశారు.
ఇందులో మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళ ఉన్నతికి కారణమైన మహిళలకు
కృతజ్ఞతలను తెలియ చేసి,మహిళా దినోత్సవ శుభాకాంక్షలను అందించారు...

నేను కూడా నా జీవితంలో సంసారాన్ని చక్కదిద్దుకోవటం,పిల్లల పెంపకం వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దటం
ఇవన్నీ నేర్పిన మా అమ్మకి నేను కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కృతఙ్ఞతలు
తెలియ చేస్తున్నాను.

ఈ విషయాలన్నీ మీ అందరితో పంచుకునేలా నాకు బ్లాగ్ గురించి తెలియచేసి,ఎలా రాయాలి,
మనసులో ఉన్న అభిప్రాయాలని తెలియ చెయ్యటం ఎలా అని,నేను చేసే వంటలు నచ్చి,
ఆ వంటలకు కూడా ఒక బ్లాగ్ క్రియేట్ చేసి,నా జ్ఞాపకాలను,అనుభూతులను పదిలపరచుకునే
ఒక వేదికగా ఈ బ్లాగ్ లు రాయటానికి అన్ని విధాలా సహకరిస్తున్న నా అమ్ములుకి
మహిళా దినోత్సవం సందర్భంగా నా ప్రత్యేక శుభాకాంక్షలు.

ప్రతి మనిషి విజయం వెనుక ఒకరు తప్పకుండ ఉన్నట్లు
"నా జీవనగమనంలో"
పోత్సహిస్తూ నన్ను వెలిగించిన వనిత
నా "అమ్ములు" I Love You.


Happy Women's Day


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

2 వ్యాఖ్యలు:

వనజ తాతినేని/VanajaTatineni said...

నాని గారు.. చాలా బాగుంది. నారు పోసిన వారిని,నీరు పెట్టిన వారిని,విద్యా బుద్దులు నేర్పిన వారిని,ఆపదలలో ఆడుకున్న వారిని.. ఎప్పుడు తలచుకోవాలి. మన జీవితంలో అభ్యున్నతికి కారణమైన వారికి కృతజ్ఞతలు తప్పకుండా చెప్పాలి. వనితా టీవి వారు నిర్వహించిన కార్యక్రమం చాలా బాగుంది.(నేను చూడక పోయినామీ మాటల్లో విని ) మీ అమ్ములు కి అభినందనలు. మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసినందుకు.
అమ్ములుకి (రాజీకి) నా ఆభినందనలు చెప్పండి

నాని.నామాల said...

వనజ వనమాలి గారూ పోస్ట్ నచ్చినందుకు,నేను పరిచయం చేసిన కార్యక్రమం నచ్చినందుకు చాలా థాంక్సండీ..

"నారు పోసిన వారిని,నీరు పెట్టిన వారిని,విద్యా బుద్దులు నేర్పిన వారిని,ఆపదలలో ఆదుకున్న వారిని.. ఎప్పుడు తలచుకోవాలి. మన జీవితంలో అభ్యున్నతికి కారణమైన వారికి కృతజ్ఞతలు తప్పకుండా చెప్పాలి."
చాలా మంచి మాట చెప్పారు.

నా జీవనగమనం లో వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నాను..
ఇంక నా పిల్లల గురించి,శ్రీవారి గురించి చెప్పుకోలేదు.
కానీ మీరు భలే కనిపెట్టేశారు..మీరు ఊహించింది కరెక్టే..
నా అమ్ములే మీ అందరికీ తెలిసిన
"నా చిన్నిప్రపంచపు మహారాణి రాజి"

మాలా కుమార్ గారు,ఇంకా కొందరు హౌస్ వైఫ్స్ బ్లాగులు రాస్తున్నారని ఈ టీవీలొ పరిచయం చేసిన ప్రోగ్రాం చూసి నాకు కూడా బ్లాగ్ రాయాలనిపించింది..

నా ఆలోచనకు సపోర్ట్ చేసి, బ్లాగు క్రియేట్ చెసి ఎలా రాయాలో నేర్పించి,ఇప్పటికీ నాకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తుంది రాజి..
అందుకే తనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేయాలనిపించింది.

ఇలా మీ అందరి బ్లాగుల్లో నా బ్లాగ్ కూడా ఒకటిగా గుర్తింపు పొందటం,మొన్న మీ బ్లాగ్ లో నా పేరు చూసుకోవటం,మీ నుండి గిఫ్ట్ అందుకోవటం
నాకు చాలా సంతోషం గా అనిపించింది.

మీ అభినందనలకు ధన్యవాదాలు.
మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...