RSS

నా చిన్నతనం



నాగార్జునసాగర్ బ్రిడ్జి గేటులు పూర్తిగ వదిలారని చాలదూరం నుంచి చూడాలని వస్తున్నారని
ట్రాఫిక్ చాల రద్దీగావుంది అని బయటి నుంచి వచ్చిన మాబాబు విసుక్కోవటం
చూచి నాకు చాల నవ్వు వచ్చింది. .
ఎందుకంటే నాచిన్నతనంలో ఇంత రద్దీ వుండేది కాదు.ఆదివారం వచ్చినదంటే
సాగర్ చూడటానికి వెళ్ళే వాళ్ళతో వీధులు కళకళలాడేవి .

నేను సెవెంత్ చదివేటప్పుడు ఏదో ఎలెక్షన్ మీటింగ్ అని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు
సాగర్ వస్తున్నారని తెలిసి సుదూర ప్రాంతాలనుంచి అక్కడికిచేరుకున్నారు .
మా స్కూల్ నుంచి మాస్కూల్ పిల్లలు మాక్లాసు సిస్టర్ మేరీపెట్రీషియా గారు వెళ్లారు .
నేను మాత్రం మా పెద్దమ్మ పిల్లలుతో కలసి వెళ్ళాను.చాలాబాగుంది .
కానీ త్రాగటానికి నీరు దొరకక చాలా ఇబ్బందిపడ్డాము.
ఇప్పటిలాగా అప్పట్లో నీళ్ళు కొనుక్కోవటానికి వుండేది కాదు..
మీటింగ్ చాల రాత్రి వరకు జరిగినది.తిరుగు ప్రయాణంలో వెహికల్స్ దొరకక బాధపడ్డాము .
ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి.నాకోసం మానాన్న,అమ్మ,అందరు ఎదురుచూస్తున్నారు.
నాన్న చాలా కోప్పడ్డారు..నాజీవితంలో నాన్నతోతిట్లు తినడం అదే మొదటిసారి చివరిసారి.

ట్రాన్సిల్స్ తో క్లాసెస్ చాల డుమ్మా కొట్టేదాన్ని.నాన్ననాకు చాలాఇష్టo.తనతో కలసి చూసిన సినిమాలు ,
తిరిగిన స్థలాలు ఎప్పటికి గుర్తే.నాన్న డ్యూటీకి విజయవాడ,గుంటూరు వెళితే నాకు రిబ్బనులు,
రంగురంగుల పూసలదండలు తెచ్చేవారు..
కానీ అంత ప్రేమించిన నాన్న నాపెళ్లి ఐన సంవత్సరానికే చనిపోవటం నేను తట్టుకోలేకపోయాను .
అది నా జీవితం లో మరువలేని పెద్ద విషాదం..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 వ్యాఖ్యలు:

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...