నాకు నవలలు చదవటం ,సేకరించటం హాబీ .నేను చదువుకునే టైం లో సెలవులు వస్తే
మా పెద్దనాన్న కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని .
మా అక్కకి కూడా నాలాగే నవల్స్ అంటే చాలా ఇష్టం..మా అక్క ఎమెస్కో బుక్ క్లబ్ లో మెంబర్.
అక్కా వాళ్ళ ఇంట్లో నవల్స్ పెద్ద పెద్ద అలమరల్లో పెట్టి ఉండేవి .అక్కదగ్గర ఎక్కువగా
యద్దనపూడి సులోచనారాణి , కోడూరి కౌసల్యాదేవి, యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల్స్ ఉండేవి
నేను వెళ్ళిన దగ్గరి నుండి మరలా ఇంటికి వచ్చేదాకా అవే చదువుకుంటూ వుండేదాన్ని...
ఆవిధంగా నాకు నవల్స్ మీద ఇష్టం ఏర్పడింది..
ఆవిధంగా మొదలైన నా పఠనాసక్తి నా పెళ్లి అయిన తరువాత కూడా కొనసాగింది..
నేను కూడా ఎమెస్కో లో లైఫ్ టైం మెంబర్ ని..
తరువాత నా సొంత లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాను. నా దగ్గిర ఇపుడు
యద్దనపూడి ,యండమూరి,కోడూరి కౌసల్య కొమ్మనాపల్లి గణపతిరావు,బలభద్ర పాత్రుని రమణి,
వంశీ,మీరా లక్ష్మి , ఇంకా నాకు నచ్చిన చాలా మంది రచయితల పుస్తకాలు,
ఎమెస్కో వారు నెలనెలా ప్రచురించే కొత్త రచయితల పుస్తకాలు నా సేకరణలో వున్నాయి..
యద్దనపూడి రచనలంటే మా ఇంట్లో అమ్ములుకి, నాకు చాలా ఇష్టం.
ఆవిడ రచనలు చదువుతున్నంత సేపు ఆ పాత్రల్లో, పరిస్థితుల్లో లీనమైపోతాము..
ఆవిడ రచనలో ఒక మద్య తరగతి అమ్మాయి తన వ్యకిత్త్వం ,ఆత్మవిశ్వాసం,
హుందాతనంతో ,ఎంతటి కోటీశ్వరుడైన హీరో అయినా ఆ నాయికను ఇష్టపడి ప్రేమించే విధంగా రాస్తారు.
ఆవిడ రాసిన ఋతువులు నవ్వాయి,జీవనతరంగాలు,కీర్తికిరీటాలు,మీనా,శ్వేతగులాబి,
సెక్రటరి,ఆత్మీయులు ఇలా ఇవేమిటి ఎన్నో ఆవిడ నవల్స్ అంటే నాకు చాల పిచ్చి అనే చెప్పాలి.
ఎంతైనా ఆవిడ నవల్స్ లో లాగా తమని తాము అమ్మాయిలు ఊహించుకునే టైంలో అమ్మాయినే కదా నేను కూడా
నేను ఆవిడ నవల్స్ చాలావరకు సేకరించాను.ప్రతి పెళ్లీడుకొచ్చిన అమ్మాయి తనకు కాబోయే జీవితభాగస్వామి
ఆవిడ నవలా నాయకుడి లాగా వుండాలని కోరుకునే వాళ్ళంటే అతిశయోక్తి కాదు..
ఆవిడ రచనలు చదువుతుంటే మనకు తెలియకుండానే మన పెదాల మీదకు చిరునవ్వు వస్తుంది
కొన్ని సన్నివేశాల వర్ణనలో.. నవల్స్ లో ఇంటివర్ణన,ప్రకృతి వర్ణన కళ్ళకు కట్టినట్లుగా ఉంటుది
ప్రతి నోవెల్ లో హీరోకి,హీరోయిన్ కి వివాదం కానీ చివరికి హీరొయిన్ నే గెలిపిస్తుంది.
ఆవిడ రాసిన రచనలు కొన్ని సినిమాలుగా వచ్చాయి...
అందులో మీనా,జీవన తరంగాలు,సెక్రటరీ,ఆత్మీయులు,రాధాకృష్ణ,అగ్నిపూలు,ఆరాధన
నాకు చాలా ఇష్టమైనవి.
ఈ సినిమాల CD లు నా CD ల కలెక్షన్ లో ఉన్నాయి ...
ఇంకా నాకు చాలా ఇష్టమైన నవల "ఈ దేశం మాకేమిచ్చింది"
ఆవిడ నవల్స్ ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు అని చెప్పలేను..
కొండ ఎంత పెద్దదైనా అద్దంలో చిన్నగా కనిపించినట్లు ఆవిడ గురించి ఎంత వర్ణించినా ఎంత చెప్పుకున్న తక్కువే..
ఇవీ నా జీవనగమనంలో నా అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గారి ముచ్చట్లు..
నా అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి
7:30 PM |
లేబుళ్లు:
యద్దనపూడి సులోచనారాణి
Subscribe to:
Post Comments (Atom)
11 వ్యాఖ్యలు:
యద్దనపూడి గారి గురించి చాలా చక్కగా చెప్పారండీ..
నాకు,మా అమ్మకు కూడా అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి..
మీకు నచ్చిన నవల్స్ అన్నీ మాకు కూడా నచ్చుతాయి
మంచి పోస్ట్..
యద్దనపూడి సులోచనారాణి gaaru naaku chaala istam machi vishayam chepparu dhanyavaadamulu
ఈదేశం మాకేమిచ్చింది, మీనా - ఈ రెండూ బెస్ట్
manchi abhiruchi. Meenaaa..one of thae my favrt
థాంక్యూ రాజి
మీ అభిప్రాయలు,ఆలోచనలు మా అమ్ములు లాగానే అనిపిస్తాయి నాకు
Thanks for your comment..
తెలుగు పాటలు గారు ఐతే మీకు కూడా యద్దనపూడి రచనలంటే
ఇష్టమన్న మాట..
నా పొస్ట్ నచ్చినందుకు,మీ స్పందనకు ధన్యవాదములు
కొత్తపాళీ గారు ధన్యవాదములు
నాకు కూడా "ఈదేశం మాకేమిచ్చింది, మీనా"
ఈ రెండు చాలా నచ్చే నవల్స్ ..
వనజవనమాలి గారు ధన్యవాదములు..
నా అభిరుచి నచ్చినందుకు సంతోషం
మీనా నాకు కూడా నచ్చిన నవల
యద్దనపూడి నవలలు దాదాపు అన్నీ నాదగ్గరా వున్నాయి . అప్పుడప్పుడు టైం పాస్ కోసం తీసి చదువుతూ వుంటాను :)
థాంక్యూ మాలాకుమార్ గారు..
ఐతే మీరు కూడా యద్దనపూడి గారి అభిమాని అన్నమాట.
నేను కూడా ఆమె నవల్స్ సినిమాలు,సీరియల్స్ టీ వీ లో వచ్చినప్పుడు
వాటికి సంబంధించిన నవల్స్ చదువుతుంటాను ..
యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు అంటేచాలా ఇష్టం నేనుఅన్ని చదవక పోయినా కొన్ని నవలలు మాత్రం
చదివాను.
అలాగే ఆమె నవలలు సినిమాలుగా తీసినవి చాలా చూసాను.
ఈదేశం మాకేమిచ్చింది. నాకు చాలా ఇష్టం.
పోలిస్ ఆఫీసర్ జీవితాన్ని బాగా వివరించారు.
Post a Comment