RSS

పేగుబంధం


నీవు మొదటి సారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది,
నన్ను
అమ్మను చేస్తున్నావని

నీవు
వూపిరాడనీయకుండా కదులుతూ హడావుడి చేస్తుంటే ,
ఉత్సాహం
కనిపించింది..హుషారైన వాడివని

నన్ను
చీల్చుకుని లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది
నా
ప్రతిరూపానివని

నా
రక్తాన్ని పాలుగా తాగుతుంటే,బోలెడంత ఆశ కలిగింది
అందరికంటే
బలవంతుడివి కావాలని

తప్పటడుగులు
వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే,
తట్టుకోలేనంత
ఆనందం కలిగింది..
నీ
కాళ్ళ మీద నీవు నిలబడగలవని..

అడుగుల్తోనే నాకు దూరమైతే ఆశీర్వదించాలనిపించింది
గొప్పవాడివి
కావాలని

జీవన
ఒత్తిడిలో పడి నన్ను మరిచిపోతే,కొండంత ధైర్యం వచ్చింది
నేను
లేకపోయినా బ్రతకగలవని

ప్రాణం
పోయేటప్పుడు కంట తడి పెట్టనందుకు తృప్తిగా ఉంది
నీకు
తట్టుకునే శక్తి వుందని

ఇప్పుడే
బాధగా వుంది.అందరు నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే
నన్ను
కాల్చేటప్పుడు నీ చేయి కాలుతుందేమోనని


సాక్షి ఫండే లో లవ్ అనే శీర్షికలో ప్రచురితమైన,
"జి.ఆనంద్" గారు రాసిన
కవిత నాకు చాలా నచ్చింది.
తల్లిప్రేమ గురించి రచయిత చాలా చక్కగా వర్ణించారు..


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

5 వ్యాఖ్యలు:

రసజ్ఞ said...

నిజమే నేను కూడా చదివాను! చాలా చక్కగా వ్రాశారు. దానిని మీరిలా పంచుకోవటం ఇంకా బాగుంది!

ప్రతి-ఉదయం said...

ఇంత చక్కటి కవిత వ్రాసిన జి. ఆనంద్ గారికి , దాన్ని ఇక్కడ మా కోసం అందించిన మీకు నా థాంక్స్ .

నాని.నామాల said...

@ప్రతి-ఉదయం గారు
@రసజ్ఞ గారు
ఈ కవిత చదవగానే చాలా నచ్చింది..
మీ అందరితో పంచుకోవాలనే నా ప్రయత్నం మీకు నచ్చినందుకు
థాంక్ యూ

వనజ తాతినేని/VanajaTatineni said...

chaalaa baagaa nacchindi. thank you very much. Amma prema kannaa..goppadi inkemanaa lene ledu!!!!!!!!!!!

నాని.నామాల said...

mee spandanaku dhanyavadamulu vanajavanamali garu

inta chakkani kavita rasina g.anandgariki mee tarapuna kuda thanks..

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...