RSS

నీ కంటిచూపు నాకు ఉషోదయం..


సూరీడు కిరణాలు భూమిని వీక్షిస్తుంటే వసుధ తన పచ్చని పరువాన్ని దాచుకుంటుంది.
చల్లని గాలిలో తేలియాడుతూ కమ్మని గీతం నా చెవిన పడింది.
కనులు కనులతో కలపడితే కలలకు పేరేమి?
నా సూరీడు కిరణాల కోసం నా కనులు వెతికాయి. భగవద్యానం చేసుకుని ఆఫీసు కు సిద్దమవుతున్నారు.
ఏమండి !మీ భోజనం సిద్దం లంచ్ బాక్స్ ఇస్తూ అన్నాను.
నవ్వుతు చూస్తారని ఆశపడ్డాను గీతంలోని కలలు కోరుకుంటూ .
వినినట్టు లేరు .హడావిడిగా ఆఫీసు ని తలచుకుంటూ బండి మీద దూసుకుపోయారు..
నా కనులు చెమ్మగిల్లాయి..
సాయంత్రం తప్పక చూస్తారులే అని చెప్పా నా కళ్ళకి.వేచి ఉన్న సాయంత్రం రానే వచ్చింది.
సూరీడు రాత్రికి రమ్మని భూమికి కబురిచ్చి వెళ్ళాడు.తన వేడి వాడి చూపులతో తనువంతా తరచి మరీ.
నా సూరీడు అలసి సొలసి చేరారు ఇంటికి.తనువు అలసింది కాని మనసు కాదు కదా!
నా ఎదురు చూపులు కాస్త కలబడాలని సిద్ధమయినాయి.
కాని T.V ..ముందు కుర్చుని తన కళ్ళని
T.V..కి సమర్పించినట్టున్నారు..
భోజనం కుడా
T.V చూస్తూనే ముగించారు.
ప్చ్!రాత్రికి దొరుకుతారులే !నా కళ్ళు మెరిసాయి. అప్పుడు కూడా నిరాశే ఎదురైనది.
లైట్లు ఆర్పి వచ్చి నా మీదకి దూకారు.
ఆయన కళ్ళ కోసం వెదికాయి నా కళ్ళు
కలల కోసం,కలబాడటం కోసం
... చిమ్మ చీకట్లో ఆయన స్పర్స దొరికిందే కాని ఆయన కనులు దొరకలేదు.
నా కళ్ళు కన్నీరయ్యాయి..
నీ కంటి చూపు చాలునయ్యా శ్రీవారు!
ఆభాగ్యం ఇచ్చి భాగ్యవతి ని చేయవయ్య
భర్తగారు!
నా కనులు కుడా చెదిరిన కలతతో మూతపడ్డాయి మరో ఉషోదయం కోసం!
మంచి శుభారంభం కోసం !
నా సూరీడి కిరణాల కోసం !

చిన్ని కవితలో భర్త కంటిచూపు కోసం తపన పడే ఇల్లాలి ఆవేదన కనిపిస్తుంది
ఇలాంటి భార్యలు లోకంలో ఎంతమందో.
నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో ఉదయాన్నే లేచిన దగ్గరనుండి
బిజీ బిజీగా వుంటూ ఆఫీసుకెళ్ళి తిరిగి ట్రాఫిక్ పద్మవ్యూహాలని దాటుకొని ఇంటికొచ్చేసరికి
సర్వ శక్తులు ఉడిగి..రాత్రికి ఇంటికి వచ్చాక కూడా కనీసం మాట్లాడుకునే ఓపిక లేకపోయినా...
కాస్త టైం కూడా టీవీలకి,కంప్యూటర్లకి అప్పగించి నిద్ర పోయే వాళ్ళు ఎంతమందో.
ఇంక ఎక్కడ
కనులు కనులతో కలబడితే కలలకు పేరేమి???

కవిత "జి.వసంత - రాజమండ్రి" గారిచే రచించ బడినది.నాకు చాల నచ్చిన కవిత ఇది .
రచయిత్రి గారికి థాంక్స్....


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

4 వ్యాఖ్యలు:

మౌనముగా మనసుపాడినా said...

చాలా బాగుంది

రాజ్యలక్ష్మి.N said...

బిజీ జీవితాల గురించి,దొరికిన కాస్త సమయాన్ని కూడా కలిసి గడపలేని
మనస్తత్వాల గురించి రచయిత చాలా చక్కగా రాశారు..
మీ బ్లాగ్ ద్వారా మంచి కవితను చదివే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదములు

నాని.నామాల said...

"మౌనముగా మనసుపాడినా" గారు
Thankyou.

నాని.నామాల said...

రాజి గారు Thankyou.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...