RSS

ధనమేరా అన్నిటికీ మూలం...

మా అమ్మ చాల పొదుపు అనే చెప్పాలి. నాన్న తెచ్చిన జీతం చాలా జాగ్రత్తగా ఉపయోగించేది.నాన్నగారు ప్రతి రోజు ఉదయాన్నే మా అందరికి ఒక రూపాయి చొప్పున ఇచ్చేవారు .అంటే ఇది 40 సం"నాటి మాట. అమ్మ మా అందరికి డబ్బు దాచుకోవటానికి ఎవరి డబ్బుల ముంత వారికి కొని ఇచ్చేది.అప్పటిలో ముంతలు ఎర్రమట్టితో చేసి, గుండ్రటి కూజాల్లగా ఉండేవి.ఇప్పటిలాగా డిజైన్స్ తో కలర్స్ తో ఉండేవి కాదు..అప్పటిలో 25,20,10 పైసల నాణేలు ఉండేవి..ఉదయం నుంచి సాయంత్రం లోపు మా పెద్ద అక్క 25 పైసలు మాత్రము ముంత లో వేసేది,నేను అన్నయ్య మా రెండో అక్క మొత్తం రూపాయి వేసే వాళ్లము .అమ్మ ముంతలన్నీ దేవుడి గదిలో పెట్టేది.ఆ ముంతలమీద ఎవరి పేర్లు వాళ్లము పేపర్ మీద రాసి అంటించేవాళ్లము.  

ముందుగ అన్నయ్యది,రెండో అక్క ముంత నిండేవి. ఇది గమనించిన మా చెల్లి రాత్రి మేమంతా నిద్ర పోగానేతను లేచి మా ముంతలలోని డబ్బును పిన్నులతో తీసి, తన ముంతలో వేసుకునేది.ఆడబ్బు తో మేము మావూరి తిరునాళ్ళలో మంచి బొమ్మలు ఇంకా మాకు అవసర మైనవి కొనుక్కునేవాళ్లము .మా అమ్మ ఎంతో పొదుపుగా వుంది కాబట్టే మేము ఐదుగురు ఆడపిల్లలమైనా అందరికీ కట్న కానుకలిచ్చిచాలా బాగా తన బాధ్యతను పూర్తిచేసుకుంది.. ఈ విషయంలో అమ్మని అనుసరించాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాను..


ఈ అలవాటు మా ఇంటి లో కుడా నేను కొనసాగించాను. మా అమ్ములు,బాచి,స్వీటీ లతో వాళ్లకి ఇచ్చినడబ్బుల్లోనే కొంత దాచటం నేర్పి,ముంతల్లో వేసేలా అలవాటు చేసాను..

ఇంట్లో ఖర్చుకు మా వారు ఇచ్చిన డబ్బును కూడా జాగ్రత్తగా వాడి మిగిలిన డబ్బును పోస్ట్ ఆఫీస్ లో
RD కట్టేదాన్ని మా నలుగురి పేరు మీద.RD టైం అయిపోగానే దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయించేదాన్ని.. 

మేము ఒక స్థలం కొన్నాము. దానికి కొంత డబ్బు తగ్గింది. మాకు పొలాలు మీద కవులు డబ్బు వస్తుంది,కాని ఆ డబ్బు రావటానికి ఇంకా టైం ఉంది. రిజిస్ట్రేషన్ టైం దగ్గర పడుతుందని మావారు కంగారు పడసాగారు.నేను ఇది గమనించి పిల్లల RD డబ్బు ఇమ్మంటారా అని అడిగాను..నన్ను చూసి నవ్వి డబ్బులు కావలిసినది ఇంటి బొమ్మ కోసం కాదు ఇంటికోసం అన్నారు.పోస్ట్ ఆఫీసు మా ఇంటికి చాల దగ్గిర. మావారు బైటకి వెళ్ళిన తర్వాత నేను వెళ్లి డబ్బులు డ్రా చేసాను.మరుసటిరోజున మా వారు వాళ్ళ అన్నయ్య దగ్గరికి బయలుదేరుతుంటే నేను డ్రా చేసిన డబ్బు తీసుకెళ్ళిఇచ్చాను.

ఆ డబ్బు చూసి మీ అమ్మని అడిగావా,అన్నయ్యని అడిగావా అని అన్నారు.అప్పుడు నేను పిల్లల పోస్ట్ ఆఫీస్ RD డబ్బులివి.అని ఆ కాగితాలు చూపించాను..ఆ విధంగా మా ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యింది..అప్పుడప్పుడు మాటల సందర్భంలో మా వారు పిల్లలతో అమ్మలాగా పొదుపు నేర్చుకోండి అంటుంటారు..స్థలం కొనేటప్పుడు నేను చేసిన హెల్ప్ గుర్తు చేసుకుని సంతోషిస్తారు..


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 వ్యాఖ్యలు:

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...